కరేబియన్ ద్వీప దేశం హైతీ లో పెద్ద ప్రమాదం జరిగింది. కేప్ హైతియన్‌లో పెట్రోలు తీసుకెళ్తున్న ట్యాంకర్ పేలి 50 మంది మరణించారు.
పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనోర్ వెల్లడించారు. ఘటనా స్థలంలో 50-54 మంది సజీవ దహనమవడం నేను చూశాను' అని పాట్రిక్ అల్మోనోర్ చెప్పారు. దాదాపు 20 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. మృతుల సంఖ్యను ఇప్పుడే చెప్పలేం. ఈ ఘటనపై ప్రధాని ఏరియల్ హెన్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇళ్లలో చిక్కుకున్న వారితో పాటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa