పశ్చిమ బెంగాల్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఓ ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బాలుడిని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. ఆ బాలుడు అబుదాబి నుండి హైదరాబాద్ మీదుగా బెంగాల్‌కు వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులకు మాత్రం నెగిటివ్ వచ్చిందన్నారు. బాలుడికి ముర్షిదాబాద్ జిల్లాలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa