ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 03, 2017, 05:26 PM

కోయంబత్తూర్‌: తమిళనాడులోని కోయంబత్తూరులో ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమం ప్రారంభమైంది. నదుల సంరక్షణే ధ్యేయంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కోయంబత్తూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 21 నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి అక్టోబర్‌ 3వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీ ప్రారంభోత్సవానికి భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు తరలివచ్చారు. భవిష్యత్తు తరాలకు మంచినీరు దొరకని ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటుండటంతో నదులను కాపాడాల్సిన ఆవశ్యకతను ప్రచారం చేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు సైతం మద్దతు తెలపుతున్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చి దీనిలో భాగస్వాములు కావాలని ప్రజల్ని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa