దేశ జనాభా విస్ఫోటనాన్ని అడ్డుకునేందుకు అనుసరించిన వ్యూహం ఇప్పుడు చైనా ను కొత్త సమస్యల్లోకి నెడుతోంది. అక్కడ అమలు చేసిన కఠిన నిబంధనల ఫలితంగా జనాభా అదుపులోకి వచ్చినప్పటికీ ఆ దేశంలో ఇప్పుడు యువత సంఖ్య తగ్గేందుకు కారణం అయింది. ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు ముందస్తు వ్యూహాలను చైనా అమలు చేస్తోంది. ఈ కోవలోనే జిలిన్ ప్రావిన్సు ప్రకటించిన కొత్త పథకం ఆసక్తికరంగా మారింది. పెళ్లై పిల్లలను కనాలనుకునే జంటలకు 2 లక్షల యువాన్ల (సుమారు రూ. 25 లక్షల) బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని ప్రకటించింది. అలాగే చిరు వ్యాపారాలు నడిపే జంటలకు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారి వ్యాపారాల్లో పన్నులపై రాయితీని ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa