రాజస్థాన్ లో దారుణం జరిగింది. మాల్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను 5 వేల రూపాయలకు ఇద్దరు వ్యక్తులకు అమ్మాడు. ఒప్పందం ప్రకారం ఆ వ్యక్తులు ఆయన భార్యతో గడుపుతారు. ఈ విషయం భార్యకు తెలియదు. ఇంతలోనే ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు. వారితో గడపాలని భార్యకు భర్త చెప్పడంతో ఆమె ఖంగుతింది. ఆమె నిరాకరించడంతో భర్తతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెను విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె పై వారు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు విచారణ చేస్తున్నారు. వారం క్రితం ఈ ఘటన జరిగినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa