క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇసుకతో పాటు 5 వేల 400 గులాబీలు వినియోగించి శాంటాక్లాజ్ రూపాన్ని తీసుకువచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలని సుదర్శన్ పట్నాయక్.... సందేశాన్నిచ్చారు. భారీ సైకతం శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa