రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకొస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆ 3 చట్టాలను తిరిగి తీసుకురాదని ఆయన వెల్లడించారు. 3 వ్యవసాయ చట్టాలను కొందరు నల్ల చట్టాలుగా అభివర్ణించి వివాదాలు సృష్టించారని, అందువల్లే రద్దు చేశామని చెప్పారు. ఆ చట్టాలను మళ్లీ తీసుకొస్తామని తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తలపై నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టత ఇచ్చారు. తను అలా చెప్పలేదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa