ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం చర్చనీయాంశమైంది.మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి, ఆ డబ్బును హవాలా మార్గంలో ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు తరలించినట్లు అభియోగాలున్న నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa