విశాఖపట్నం: కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీ కొని భార్యాభర్తలు మృతి చెందిన ఘటన తాటిచెట్లపాలెం సిగ్నల్ పాయింట్ వద్ద సోమవారం మద్యాహ్నం చోటుచేసుకున్నది. ఈ ఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. సబ్బవరం గుల్లిపల్లి ప్రాంతానికి చెందిన కొల్లూరి నగేష్( 43), అతడి బార్య స్వర్ణ (35) సోమవారం ఎన్. ఏడీ కూడలి జాతీయ రహదారి మీదుగా నగరం వైపు ద్విచక్ర వాహనం పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో తాటిచెట్లపాలెం సిగ్నల్ పాయింట్ వద్ద కి వచ్చే సరికి కాంక్రేట్ మిక్సర్ లారీ డీ కొని.. భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. విశయం తెలుసుకున్న కంచరపాలెం ట్రాఫీక్ సి. ఐ కృష్ణరావు , ఎస్. ఐ శ్రీనివాస్ పరిస్థితి సమీక్షించారు. మృత దేహలను కేజీహెచ్ కు తరలించి.. కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa