ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు నైట్ కర్ఫ్యూను అమలుచేయనున్నట్లు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. దుకాణాలు, సంస్థలు రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఆ రాష్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల తర్వాత న్యూ ఇయర్ వేడుకలు కొనసాగించరాదని కేరళ ప్రభుత్వం సోమవారం ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa