దేశంలో మరో రెండు కోవిడ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి మార్గం సుగమమైంది. పుణెలోని సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కొవొవాక్స్, హైదరాబాద్ లోని బయొలాజికల్ ఈ సంస్థ అభివృద్ధి చేసిన కొబ్రెవాక్స్ కు... అనుమతి మంజూరు చేయాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ-CDSCO నిపుణుల కమిటీ..సిఫారసు చేసింది. అమెరికాకు చెందిన నొవావాక్స్ నుంచి టీకా సాంకేతికతను పొందిన S.I.I.... కొవొవాక్స్ ను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం కోసం. ఈ ఏడాది అక్టోబర్ లోనే DCGIకు దరఖాస్తు చేసింది. ఈ క్రమంలోనే CESCO నిపుణుల బృందం పరిశీలించి, కేంద్రానికి సిఫారసు చేసింది. బయొలాజికల్ -E సంస్థ సమర్పించిన..... క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను పరిశీలించిన నిపుణుల కమిటీ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం DCGIకు సిఫారసు చేసింది. కరోనా చికిత్స కోసం తయారు చేసిన మాల్ నుఫిరవిర్ మాత్రను కూడా అత్యవసర వినియోగానికి CDSCO సిఫారు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa