ఐరన్ లోపం అనీమియా అనేది ఓ సాధారణ సమస్య. రక్తంలో తగినంత ఎర్రరక్తకణాలు లేకపోతే సమస్య ఏర్పడుతుంది. ఎర్రరక్తకణాలు శరీర కణజాలాలకి ఆక్సీజన్‌ని తీసుకెళతాయి. శరీరానికి తగినంత ఐరన్ అందకపోతే ఐరన్ లోపం ఏర్పడుతుంది. అంతేకాకుండా, పీరియడ్స్, బాడీలోపలే రక్తస్రావం కారణంగా రక్తం తగ్గుతుంది. ఐరన్ తగ్గితే బాడీలో ఎర్రరక్తకణాలు తగ్గుతాయి. దీంతో అలసట, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఐరన్ తగ్గితే కనిపించే లక్షణాలు
ఐరన్ తగ్గితే బాడీ ఊరికే అలసిపోతుంది. నీరసంగా మారతారు. స్కిన్ కూడా డల్ అయిపోతుంది. ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస సమస్యలు, తలనొప్పి, చేతులు, పాదాలు చల్లబడడం, గొంతులో మంట, గోళ్ళు విరిగిపోవడం వంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటి లక్షణాల్ని ముందుగానే గుర్తించి సమస్యని తగ్గించుకునేందుకు చాలా మంది మెడిసిన్ వాడుతుంటారు. అయితే, అలా కాకుండా, కొన్ని ఫుడ్స్ ఆటోమేటిగ్గా మనకి బాడీలో రక్తం పెరుగుతుంది. అలాంటి ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఐరన్ రిచ్ ఫుడ్స్
ఐరన్ పెరగడానికి మనం వెజిటేరియన్ ఫుడ్స్‌ని కొన్నింటిని చూస్ చేసుకోవచ్చు. అందులో రాజ్మా, ఖర్జూరం, తాటిబెల్లం, పాలకూర, రాగులు ఇలా ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవచ్చు. నువ్వులతో ఇలాంటి ఫుడ్స్‌ని తీసుకుంటే మనకి బాడీలో సరైన విధంగా హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. ఆరోగ్యానికి కూడా మంచిది.
ఎలా తీసుకోవాలి?
ఐరన్ ఫుడ్స్ గురించి చాలా మందికి తెలుసు. వాటిని తీసుకున్నప్పటికీ కొంతమందికి రక్తం పెరగదు. అలాంటప్పుడు ఆ ఐరన్ రిచ్ ఫుడ్స్‌ని మనం సరైన విధంగా తీసుకోవడం తెలియాలి. అప్పుడే ఐరన్ మన బాడీకి అందుతుంది. పులియబెట్టిన ఉసిరి, నిమ్మకాయ వంటి విటమిన్ సి వనరులతో తీసుకోవడం మంచిది. ఇది చిన్న మార్పే అయినప్పటికీ మంచి రిజల్ట్ ఉంటుంది.
తినడానికి ముందు తర్వాత ఇవి వద్దు
అదే విధంగా, ఐరన్ ఫుడ్స్ తినడానికి ముందు, తర్వాత టీ లేదా కాఫీని తీసుకోవద్దు. దీని వల్ల మనం ఐరన్ ఎంతగా తీసుకున్నా మన శరీరానికి అబ్జార్బ్ అవ్వదు. అందుకే, ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకునే గంట ముందు, తర్వాత మాత్రం టీ, కాఫీలను అసలే తీసుకోవద్దు. ఆ తర్వాత తీసుకోవచ్చు.
అవిసెలు తింటారు కానీ
కొంతమంది అవిసెలు తింటే ఐరన్ పెరుగుతుందని తింటారు.వీటితో పాటు కాక్టస్ పండ్లు కూడా తింటారు. ఇవి సహాయ ఆహారాలుగా పనిచేస్తాయి. కానీ, ఐరన్‌ని మాత్రం అందించవు. ఐరన్ ఫుడ్స్ కావు. కాబట్టి, వీటిపై ఆధారపడొద్దు.
ఎలా తిన్నా పెరగకపోతే
ఇన్ని జాగ్రత్తలు తీసుకుని సరైన విధంగా, ఐరన్ ఫుడ్స్ తిన్నా బాడీలో రక్తం లెవల్స్ పెరగట్లేదంటే హిమోగ్లోబిన్, ఫెర్రిటిన్ లెవల్స్ తక్కువగా ఉంటే సమస్య ఉండొచ్చు. దీనికి ఫుడ్ మాత్రమే హెల్ప్ చేయదు. డాక్టర్ సజెషన్ అవసరమవుతుంది. కాబట్టి, డాక్టర్‌ని వెంటనే కలవండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa