కోవూరు మండలం పొడుగు పాడు వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి విడవలూరు మండలం దండిగుంట గ్రామానికి చెందిన ఎందేటి శ్రీనివాసులుగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa