2021లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు మాత్రమే పదికి పైగా ఓడీఐ గేమ్‌లు ఆడాయి. కరోనా మహమ్మారి కారణంగా డిసెంబర్‌లో జరగాల్సిన పాకిస్తాన్ vs వెస్టిండీస్, ఐర్లాండ్ vs యూఎస్ఏ వన్డే సిరీస్‌లు రద్దయ్యాయి. ఈ ఏడాది జరిగిన వన్డే సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లను పరిశీలిద్దాం.
1. పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) – 705
ఐర్లాండ్ ఆల్ రౌండర్ పాల్ స్టిర్లింగ్ ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ మొత్తం 14 ఇన్నింగ్స్‌ల్లో 54.23 సగటుతో 705 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్‌లో మొత్తం మూడు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
2. జన్నెమన్ మలన్ (దక్షిణాఫ్రికా) – 509
దక్షిణాఫ్రికా రైజింగ్ స్టార్ జన్నెమాన్ మలన్ ఈ ఏడాది వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తన అద్భుతమమైన ఆటతీరుతో బాగా ఆకట్టుకున్నాడు. 25 ఏళ్ల మలన్ కేవలం ఏడు ఇన్నింగ్స్‌లో 84.83 సగటుతో 509 పరుగులు చేశాడు. ఈ ఏడాది మలన్ మొత్తం రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. 2022 ప్రారంభంలో భారత్‌తో జరగనున్న సిరీస్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
3. తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)- 464
ఆసియా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్ 2021లో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు 38.66 సగటుతో 12 ఇన్నింగ్స్‌లలో 464 పరుగులు చేశాడు. తమీమ్ ఇక్బాల్ ఈ సంవత్సరంలో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు.
4. హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) – 454
హ్యారీ టెక్టర్ 2021లో ఒక్క వన్డే మ్యాచ్‌లో కూడా సెంచరీ చేయలేదు. అయితే పరుగుల స్కోరింగ్ లీడర్ బోర్డ్‌లో మాత్రం మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాడు. డబ్లిన్‌కు చెందిన 22 ఏళ్ల హ్యారీ టెక్టర్ ఐర్లాండ్ తరపున 14 వన్డే మ్యాచ్‌లలో ఆడాడు. 75.66 స్ట్రైక్ రేట్‌తో 454 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం టెక్టర్ చేసిన అత్యధిక స్కోరు 79.
5. ఆండీ బాల్బిర్నీ (ఐర్లాండ్) – 421
ఐర్లాండ్ కెప్టెన్ ఆండీ బల్బిర్నీ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిగా నిలిచాడు. అతను ఆడిన 14 వన్డే ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 421 పరుగులు చేశాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ 2021లో 32.38 బ్యాటింగ్ రన్‌రేటు, 71.96 స్ట్రైక్ రేట్ సాధించాడు.