దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలిటెస్టులో సఫారీలపై భారత్ 113 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన కొన్నిగంటలకే డికాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతానని తెలిపాడు. కుటుంబంతో మరింత సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని స్పష్టం చేశాడు. దీర్ఘకాల ఫార్మాట్లో అతడు 53 టెస్టులు ఆడి.. 3300 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 22 అర్ధసెంచరీలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa