తమిళనాడులో ఓ రైల్వే ఉద్యోగి టికెట్ కౌంటర్‌లోని డబ్బుల్ని నొక్కేసి నాటకం ఆడాడు. చివరకు తన భార్యతో సహా కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువాన్మియూర్ రైల్వే స్టేషన్‌లో రాము అనే వ్యక్తి ప్రయాణికులకు టికెట్ ఇచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 3న తాను డ్యూటీలో ఉండగా ముగ్గురు దుండగులు తనను బెదిరించి కౌంటర్‌లో ఉన్న లక్షా 32 వేలు దోచుకుని వెళ్లిపోయారని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌లో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రాము భార్య రైల్వే స్టేషన్ వైపుగా ఆటో దిగి రావడం రికార్డయింది. పోలీసులు రామును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa