పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకోవడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం కొనసాగుతోంది. పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి చుక్కెదురు వ్యవహారంపై దుమారం కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్- బీజేపీ నేతలు విమర్శల జడివాన కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్ గడ్ సీఎం భూపేష్ బాగల్ స్పందించారు. సభలో 70 వేల కుర్చీలు ఉండగా.. 700 మందే ఉన్నారని ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ఈ క్రమంలో బాగల్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోడీ చేసిన ఆరోపణలు స్క్రిప్ట్ అని ఆరోపించారు. ప్రణాళిక ప్రకారం వివాదం రాజేశారని తెలిపారు. అంతే తప్ప అందులో నిజం లేదని చెప్పారు. కావాలని ప్రణాళిక ప్రకారం అమలు చేశారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa