కృష్ణా జిల్లా: భద్రాచలం జాతీయ రహదారిపై కొండపల్లి కొత్త గేటు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన స్కూటీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు బాలురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ శనివారం కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తుండగా కొత్త గేటు వద్ద ప్రమాదం జరిగింది. ఎం స్టాలిన్(14), బొజ్జ గాని సాయిచరణ్(16) రాలు కొండపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa