నెల్లూరు: పోలీసులు ఇద్దరు లారీల దొంగలను పట్టుకొని అరెస్ట్ చేసారు. తమిళనాడు లోని సేలం కు చెందిన ముత్తు, రాజేష్ కుమార్ అనే ఇద్దరు. గత ఏడాది డిసెంబర్ నెలలో తడమండలంలో 2 లారీలను అపహరించారు. ఈ లారీలు తమిళనాడు లోని సేలం కు తీసుకువెళ్లినట్లు పోలిసుల దర్యాప్తులో గుర్తించారు. ఎస్ఐ జెపి రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సిబ్బందికి క్యాష్ రివార్డులు అందజేశారు.ఈ సమావేశం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa