ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ భవన్‌లో ముగిసిన టిడిపి నారీ సంకల్ప దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 07:58 PM

తెలుగుదేశం నారీ సంకల్ప దీక్ష సోమవారం ఉదయం ఎన్టీఆర్ భవన్ వద్ద ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో దీక్ష ప్రారంభమైంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మద్యపాన నిషేధం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, మహిళా సాధికార సంఘాల నిర్వీర్యానికి నిరసనగా 'టీడీపీ నారీ సంకల్ప దీక్ష' చేపట్టింది. తెలుగు మహిళా రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ నిరసనలో కూర్చున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. గీతకు నిమ్మ రసం ఇచ్చి దీక్షను ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర విరమింపచేశారు. ఈ దీక్షకు తెలంగాణా రాష్ట్రం నుంచి కూడా  మహిళలు తరలివచ్చారు. దీక్షలో‌ పాల్గొని బోండా ఉమా, పట్టాభి, పత్తిపాటి పుల్లారావు, ఎంఎస్ రాజు, వర్లరామయ్య, కొల్లు రవీంద్ర ప్రసంగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa