ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 08:25 AM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జనవరి వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారమే అమలు చేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగులు, పెన్షనర్లకు 2022 జనవరి వేతనాలు రివైజ్డ్ పే స్కేల్ ప్రకారమే వేతనాలు చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ పే స్లిప్ లను ఆన్ లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఉద్యోగుల సెల్ ఫోన్ లకు వేతనానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం వస్తుందని ఆర్థికశాఖ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa