ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-అగర్తల-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి సోమవారం ఈ రైలు(07030) సికింద్రాబాద్‌లో 16. 35 గంటలకు బయలుదేరి గుంటూరు 21. 10, విజయవాడ 22. 05, అగర్తల గురువారం 03. 00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07029) ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి శుక్రవారం, ఏప్రిల్ 1న అగర్తలలో 06. 10 గంటలకు ప్రారంభమై ఆదివారం విజయవాడ 08. 20, గుంటూరు 09. 35, సికింద్రాబాద్ 16. 15 గంటలకు వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa