ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొరాయించిన ఈ నామ్‌ సర్వర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 08:29 AM

గుంటూరు మిర్చియార్డులో క్రయవిక్రయాలు మందకొడిగా సాగాయి. ఈ-నామ్‌ సర్వర్‌ మొరాయించడంతో ఆ ప్రభావం లావాదేవీలపై పడింది. దీంతో క్రయవిక్రయాలు ఏవిధంగా కొనసాగించాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. విక్రయాలు నిలిచిపోతే అటు రైతులు, ఇటు వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.


యార్డులో లక్షకు పైగానే మిర్చి బస్తాలు ఉన్నాయి. మంగళవారం విక్రయాలకు సోమవారం రాత్రి నుంచే రైతులు యార్డుకు బస్తాలను తరలిస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతుల లాట్ ఐడీ వేమెన్ల స్లిప్‌పై రాసి కొనుగోళ్లు చేసుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. వీటికి సంబంధించి మంగళవారం ఉదయాన్నే బిడ్డింగ్‌లు వేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.


దీంతో క్రయవిక్రయాలకు అడ్డంగులు తొలగిపోవడంతో రైతులు, వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం అధికంగా మిర్చియార్డుకు సరకు వచ్చింది. రైతులు మొత్తం 1, 06, 181 బస్తాలు యార్డుకు తరలించారు.


ఈ-నామ్‌ సర్వర్‌ పని చేయకపోవడంతో తక్కువ బస్తాలు విక్రయాలు జరిగాయి. 90, 581 బస్తాలు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఫలితంగా నిల్వ బస్తాలు పెరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి 64, 990 బస్తాలు నిల్వ ఉన్నాయి. ధరలు స్వల్పంగా పెరిగాయి.


నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ. 7, 000 నుంచి రూ. 18, 000 ఉండగా, స్పెషల్‌ వెరైటీ తేజ రకానికి రూ. 7, 000 నుంచి రూ. 17, 500, బాడిగ రూ. 7, 000 నుంచి రూ. 18, 200, తాలు మిర్చికి రూ. 4, 000 నుంచి రూ. 9, 500 ధర లభించింది. ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 341, 4884 రకాల మిర్చి సగటు ధర రూ. 9, 000 నుంచి నూ. 17, 000 ఉండగా, స్పెషల్‌ వెరైటీ తేజ రకానికి రూ. 7, 500 నుంచి రూ. 17, 000, బాడిగ రూ. 10, 500 నుంచి రూ. 17, 500,   తాలు మిర్చికి రూ. 4, 000 నుంచి రూ. 6, 000 ధర లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa