ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో జగనన్నగృహ నిర్మానాణాల గడువు పొడిగించిన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 06:45 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షలకు పైగా ఇళ్లు నిర్మించేందకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా 15.75 లక్షల ఇళ్లకు నిర్మాణాన్ని ప్రారంభించింది. గ్రామాలు, పట్టణాల్లో జగనన్న కాలనీల పేరిట అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ ఇళ్లను 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేసిన ప్రభుత్వం రెండేళ్లలో అంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఐతే ప్రభుత్వం ఇప్పుడీ గడవును పొడిగిచింది. లబ్ధిదారులను ఊరటనిస్తూ ఇళ్ల నిర్మాణ పూర్తి గడవును 2023 జూన్ వరకు పొడిగిచింది. ఈ మేరకు జిల్లాల అధికారులకు సమాచారమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం అట్టహాసంగా జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు లేని పేదలను గుర్తించి వారికి గ్రామాల్లో అయితే సెంటున్నర, పట్టణాల్లో అయితే సెంటు చొప్పున భూములిచ్చింది.
సదరు స్థలాల్లో మూడు పద్ధతుల్లో నిర్మాణం చేపట్టేలా ఆదేశాలిచ్చింది. అందులో ఒకటి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మించి ఇవ్వడం, రెండోది ప్రభుత్వం మెటీరియల్ సప్లై చేస్తే లబ్ధిదారులు నిర్మించుకోవడం, మూడోది ప్రభుత్వం నిధులిస్తే లబ్ధిదారులే పూర్తి ఖర్చు నిర్మించుకోవడం. ఐతే లబ్ధిదారుల్లో చాలా మంది ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే ఆఫ్షన్ సెలక్ట్ చేసుకోవడంతో ఆ తర్వాత సర్కార్ ఆ ఆప్షన్ పరిమితం చేసింది. దీంతో సొంజగా ఇల్లు నిర్మించుకనేందుకు ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ముందుకు రాలేదు. దీంతో ఇళ్ల నిర్మాణం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. గత ఏడాది శంకుస్థాపనచేసిన 15.75 లక్షల ఇళ్లలో దాదాపు 13 లక్షలకు పైగా ఇంకా పునాదులు, మెరక తోలించే దశలోనే ఉన్నాయి. పూర్తైన ఇళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరోవైపు వివిధ కారణాల వల్ల చాలా మంది ఇంటి నిర్మాణాన్ని కూడా ప్రారంభించలేదు. దీంతో అలాంటి లబ్ధిదారులకు ప్రభుత్వం ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసే గడువును మరో ఆరునెలలు పొడిగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa