ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలి : జేసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 09:02 AM

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌(హౌసింగ్‌) అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద ఫేజ్‌-1లో భాగంగా నిర్మాణంలో ఉన్న గృహాలను మంగళవారం అధికారులతో కలసి ఆమె పరిశీలించారు. చిలకలూరిపేట పురపాలకసంఘం పరిధిలో 4, 565 గృహాలు మంజూరుకాగా, వాటిలో రిజిస్టర్‌ చేసుకోనివి 315, నాన్‌ స్టాండింగ్‌ 90, బేస్‌మెంట్‌ లెవల్‌ కన్నా తక్కువవి 3, 978, బేస్‌మెంట్‌ లెవల్‌ 130, రూఫ్‌ లెవల్‌ 14, రూఫ్‌ కంప్లీటెడ్‌ 34, ఇళ్ల నిర్మాణం పూర్తయినవి నాలుగు ఉన్నట్లు అధికారులు జేసీకి వివరించారు. టెండరు పొందిన గుత్తేదారు నుంచి ఇసుక లేవుట్ల ప్రాంతానికి తరలించేలా చూడాలని జేసీ చెప్పగా, అందుకు అధికారులు రక్షణ కష్టమని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక మార్కెట్‌యార్డు ప్రాంతంలో ఉంచాలని సూచించారు. గృహనిర్మాణశాఖ ఈఈ బి. స్వరూపారాణి, పురపాలక కమిషనర్‌ డి. రవీంద్ర, గృహ నిర్మాణశాఖ డీఈ ఎస్‌. వెంకట్రావు, ప్రజారోగ్యశాఖ డీఈ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఏఈ వెంకటేశ్వరరావు తదితరులు జేసీ వెంట ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa