రెంటచింతలలో బుధవారం నిర్వహించే తిరునాళ్లకు కానుకమాత చర్చి ముస్తాబైంది. 172 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉత్సవం నిర్వహిస్తున్నారు. పూర్వం అనంతపురం జిల్లాలో ఏర్పడిన కరవు రక్కసి నుండి తప్పించుకునేందుకు వందలాది కుటుంబాలు రెంటచింతలకు వలస వచ్చినట్లు కథనం. వారు ప్రార్థనలు చేసుకునేందుకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో 1850లో చర్చిని నిర్మించారు. నిత్యం ప్రార్థనలు చేసుకునే భక్తుల సంఖ్య పెరగటంతో 1978లో సుమారు 3 వేల మంది విశ్వాసులు ఒకేసారి పూజలో పాల్గొనేలా నూతన చర్చిని అదే ప్రాంగణంలో కట్టుబడి చేశారు. ఏసు ప్రభువును శిలువ వేసే సమయంలో 14 స్థలాలు తిప్పారని ప్రతీతి. వాటికి గుర్తుగా 14 మందిరాలు నిర్మించారు. ప్రాంగణంలోనే పాఠశాల, భవనం, కన్యా స్త్రీలకు, విచారణ గురువులకు, వృద్ధులకు వసతి గృహాలు చేపట్టారు. గ్రామస్థులు వివాహాలు చేసుకునేందుకు కల్యాణ మండపం, వాణిజ్య సముదాయం, యూనియన్ బ్యాంకుకు భవనం నిర్మించి సామాజిక సేవలోనూ తరిస్తున్నారు.
ఉత్సవ ప్రాముఖ్యం
మోషే ధర్మ శాస్త్రం ప్రకారం క్రిస్టియన్ కుటుంబాల్లో జన్మించిన తొలిచూలు బిడ్డను ఏసు ప్రభువుకు కానుకగా సమర్పించాలి. డిసెంబరు 25న ఏసు ప్రభువు జన్మించిన పిబ్రవరి 2 నాటికి 40 రోజులు గడుస్తుంది. ఆ రోజు కానుకగా తమ బిడ్డలను ప్రభువుకు అర్పిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చేసే ఉత్సవం కావటంతో కానుకమాత తిరునాళ్లగా పేరు వచ్చినట్లు క్రిస్టియన్ సోదరులు చెబుతున్నారు. ఉత్సవాల సందర్భంగా కోలాటాలు, ప్రత్యేక పూజలు, సాంఘిక నాటకాలు, అంగళ్ల రాకతో రెంటచింతల కళకళలాడుతుంది. జనవరి 24 నుంచి నిత్యం అన్ని మందిరాల్లో నవదిన ప్రార్థనలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa