విశాఖ జిల్లా అనంతగిరి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన గిరిజనులను అన్యాయంగా అర్ధరాత్రి పూట ఎత్తుకెళ్లి కొట్టారని ఎస్. కోటలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఆర్‌పీఎఫ్ అవుట్ పోస్టు కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేశారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో ఎదురుగా ఆగి ఉన్న రైలు ముందు పట్టాలపై బైఠాయించారు. తమకు న్యాయం చేసేవరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు. ఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ నచ్చజెప్పినా ససేమిరా అన్నారు.
ఆర్‌పీఎఫ్ పోలీస్‌లు తీసుకెళ్లిన ముగ్గురిలో అప్పారావు, నూకరాజులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల తీరు వల్లే వారు అనారోగ్యానికి గురయ్యారని భావించి గ్రామస్థులు, బంధువులు ఎస్. కోట ఆర్‌పీఎఫ్ అవుట్ పోస్టు వద్దకు చేరుకున్నారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో ఎదురుగా నిలిపి ఉన్న ట్రైన ముందు పట్టాలపై భైఠాయించారు. రైలు పట్టాలపై కూర్చోవడం నేరమని స్థానిక పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో అక్కడి నుంచి కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన కొనసాగించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చిన ఆర్‌పీఎఫ్ కమిషనర్ చక్రధర్ వారితో చర్చించారు. గిరిజనులను తీసుకువెళ్లిన ఆర్‌పీఎఫ్ పోలీసులతో క్షమాపణలు చెప్పించాలని, పూర్తిగా కొలుకునే వరకు వైద్య సాయంతో పాటు కుటుంబ జీవనానికి సాయం అందించాలని గిరిజనులు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa