విశాఖపట్నం: మద్యం మత్తులో ఓ యువకుడు కత్తి పట్టుకొని ఎంవీపీ డబుల్ రోడ్డులో హల్‌చల్ చేశాడు. దీనికి సంబంధించి వివరాలు ఉన్నాయి. మంగళవారం సాయంత్రం యువకుడుఎంవీపీకాలనీ డబుల్ రోడ్డులో ఓ బ్యాంకు ముందు పార్కింగ్ చేసిన వాహనం అద్దాలను పగులకొట్టాడు. దింతో స్థానికులు ప్రశ్నించేసరికి కత్తితీసి బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేయగాపోలీసుల పైనే కత్తితో దాడికి యత్నించాడు.పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa