ఏపీలో ఉద్యోగుల ఆందోళనలపై సీఎం జగన్ స్పందించారు. పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామని చెప్పారు. కారుణ్య నియామకాలు జరపాలని చెప్పామని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మార్చి 5 లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉద్యోగులకు మంచి జరగాలని ఉద్యోగుల సర్వీసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచినట్లు సీఎం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని, జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని సీఎం ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa