ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ నిరుద్యోగులకు గొప్ప అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 02:19 PM

ఏపీఎస్ఎస్ డీసీ పలు ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా జాబ్ మేళాలకు సంబంధించిన ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వరల్డ్ వైడ్ డైమండ్ మానిఫాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పలు ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రిజిస్ట్రేషన్ కు ఫిబ్రవరి 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.


ఖాళీలు, విద్యార్హతల వివరాలు:


ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపకైన అభ్యర్థులు ట్రైనీగా పని చేయాల్సి ఉంటుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ /డిప్లొమా అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే, కేవలం పరుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.


అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు నాలుగు షిఫ్ట్స్ (ఏ,బి, సీ, డి)లలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 10, 460 స్టైఫండ్ చెల్లించనున్నారు. ఇంకా పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం ఉంటుంది.


ఇతర వివరాలు:


-అభ్యర్థులు ఈ నెల 2లోగా ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. - https://apssdc.in/industryplacements/


-రిజిసర్ట్ చేసుకున్న అభ్యర్థులకు హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు.


-ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది.


-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 8247505171 నంబర్ ను సంప్రదింవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa