ఎస్సీఈఆర్టీ వారిని నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మానక్ -2021 పోటీలు జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల వేదికగా జరిగాయి. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ అధ్యాపకురాలు డాక్టర్ సంధ్య శ్రీ వ్యవహరించారు. ఆమె 2016లో ఎస్సీఈఆర్టీ వారిచే ఇన్ స్పైర్ ప్రాజెక్టు గైడ్ ఉపాధ్యాయులకు మెంటర్ గా నియమింపబడ్డారు. ఈ పోటీల ముగింపు ఉత్సవాల్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. ఉమారాణి, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆమెను అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa