ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువకుడి మృతి ఘటనపై హత్య కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 01:44 PM

జనవరి 30వ తేదీ రాత్రి గాజువాక సమీపంలోని చిన గంట్యాడ గ్రామ దేవత కుంచమాంబ అమ్మ వారి పండుగ లో మద్యం తాగి ఘర్షణకు దిగిన ఇద్దరు యువకుల్లో తీవ్రగాయాలైన చిరసపల్లి మురళి (25) మృతి చెందిన ఘటన పై హత్య కేసు నమోదు చేసినట్లు గాజువాక పోలీసులు తెలిపారు. మిత్రుడు యేసు దాడి చేయడంతో ఆస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్న మురళి బ్రెయిన్ డెడ్ అయిందని మంగళవారం వైద్యులు ఖరారు చేశారు. ముందు ఘర్షణగా భావించిన పోలీసులు 325 కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో హత్య కేసుగా కేసును మార్చారు. నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లుసిఐ మల్లేశ్వర రావు తెలిపారు.
కన్న కొడుకు దూరమైన బాధలో ఉన్నా తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు అవయవదానానికి అంగీకరించారు. బుధవారం మధ్యాహ్నం షీలా నగర్ లోని ప్రైవేట్ ఆస్పిటల్ లోకేజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యులు అవయవాలను సేకరించారు. చిన గంట్యాడ శ్మశాన వాటికలోఅంత్యక్రియలు పూర్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa