ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన మళయాళంలో ట్విట్ చేస్తే....ఈయన అరబిక్ లో సమాధానం ఇచ్చారు

international |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 11:27 PM

యూఏఈ రాజుకు కేరళ సీఎం పినరయి విజయన్ కు మధ్య ఓ ఆసక్తికర సంభాషణ సాగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నారు. దుబాయ్ రాజు, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో ఆయన భేటీ అయ్యారు. భేటీ ముగిసిన వెంటనే దుబాయ్ రాజు మలయాళంలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విజయన్ షేర్ చేశారు. అంతేకాదు. అరబిక్ భాషలో ఆయన రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మలయాళంలో దుబాయ్ రాజు చేసిన ట్వీట్: కేరళతో యూఏఈకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దుబాయ్, యూఏఈ ఆర్థికాభివృద్ధితో పాటు అన్ని రకాల అభివృద్ధిలో కేరళ ప్రజల పాత్ర ఎంతో గొప్పది. దుబాయ్ రాజు ట్వీట్ కు విజయన్ రిప్లై: మీ ఆత్మీయ స్వాగతానికి, ఆతిథ్యానికి ధన్యవాదాలు. యూఏఈ, దుబాయ్ లతో బంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa