ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 12:19 PM

గుంటూరు: ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రేపల్లె వ్యవ సాయ సహాయ సంచాలకులు ఎన్. ఉషారాణి అన్నారు. మండలంలోని పలు దుకాణాలు పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎరువుల దుకాణ దారులు తప్పనిసరిగా లైసెన్సు పొంది ఫామ్ డి కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా ఈపాస్ మిషన్లో అమ్మకాలు, భౌతిక నిల్వలు ఒకేలా ఉండాలన్నారు. ఏవైనా వ్యత్యాసం ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వ రాయితీ ఉండదన్నారు. కావున దుకాణదారులు రైతులతో ఈపాస్ మిషన్లు వేలి ముద్రలు వేయించుకోవాలన్నారు. డీలర్లు షాపు పేరు


డోర్ నెంబరు విధిగా షాపు ముందర గోడ వద్ద ప్రదర్శించాలని చెప్పారు. షాపులో లభించే ఎరువుల నిల్వలు ధరల వివరాలు రైతులకు కనిపించేలా బోర్డులో రాసి పెట్టాలన్నారు. రైతులు కూడా ఎరు వులు కొనేందుకు దుకాణానికి వెళ్లేముందు ఆధార్ కార్డు తీసుకొని వెళ్లి ఈపాస్ మిషన్లో వేలిముద్రలు తప్పనిసరిగా వేయాలన్నారు. కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు అడిగి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa