దాససాహిత్య సర్వస్వ పేరుతో ఆరు సంపుటాలను టీటీడీ ఈవో డాక్టర్ కె. ఎస్. జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ. ధర్మారెడ్డి తో కలిసి శుక్రవారం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి 1979లో దాస సాహిత్య ప్రాజెక్ట్‌ను టీటీడీ ఏర్పాటు చేసిందన్నారు. అప్పటి నుండి దాస వాజ్ఞ్మయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ కర్ణాటక సంగీత దాస సాహిత్య తత్త్వవేత్తలైన వ్యాస రాజతీర్థులు, పాదరాజతీర్థులు, పురందర దాసులు, వాదిరాజ తీర్థులు వంటి వారి సంకీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. 2021లో సామాన్య ప్రజల కోసం కన్నడ దాసుల గొప్ప రచనలను సాహిత్య రూపంలో వెలుగులోకి తీసుకురావడాన్ని టీటీడీ "దాస సాహిత్య సర్వస్వ" పేరుతో ప్రారంభించిందన్నారు.
గత సంవత్సరం శ్రీపాదరాజ తీర్థులు వ్యాసరాజ తీర్థులు రచించిన 500 సంకీర్తనలతో దాస సాహిత్య సర్వస్వ రెండు సంపుటాలు ఆవిష్కరించినట్లు చెప్పారు. పురంధర దాసుల వారు రచించిన 1000 సంకీర్తనలతో నాలుగు సంపుటాలు, వాదిరాజ తీర్థులవారి 500 సంకీర్తనలతో కూడిన రెండు సంపుటాలు సహా మొత్తం ఆరు ప్రచురణలను భక్తులకు అందుబాటులోకి నేడు తీసుకురావడం జరిగింది అని ఆయన వివరించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పిఆర్ ఆనందతీర్థాచార్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa