చిత్తూరు: కుప్పం పట్టణ నడి బొడ్డున ఉన్న ఆర్ ఎస్ పేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మూసివేత దిశగా అధికారులు పావులు కదుపుతున్నారు. పాఠశాల మూసివేతపై ఆగ్రహించిన విద్యార్థులు మరియు వారి తల్లితండ్రులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండు నుండి ఎమ్ ఈ ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అధికారుల తీరును తప్పు పట్టారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ప్రస్తుతం సుమారు 350 మంది పిల్లలు చదువుకుంటున్నారు. 15 మంది ఉపాద్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాలల విలీనం సాకుగా చూపి ఈ పాఠశాలను మూసి వేయడానికి విద్యా శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో విద్యార్ధులకు అందుబాటులో ఉంటూ చక్కటి ఫలితాలు సాధిస్తున్న ఈ పాఠశాలను మూసి వేసి విద్యార్థులను ఇతర పాఠశాలలలో విలీనం చేయడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల రద్దు అయితే ఇక్కడున్న ఉన్న విద్యార్ధులకు
మానసికంగా విద్యాసంవత్సరం పరీక్షలకు ఇబ్బందికరంగా వుండే అవకాశం అంటూ తల్లి తండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పాఠశాలలు మూసివేస్తారు ఇంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలను మూసి వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది పురోగమనమా లేక తిరోగమనమా విద్యశాఖ అధికారులే చెప్పాల్సి ఉందని తల్లిదండ్రులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa