చిత్తూరు: చంద్రగిరి మండల పరిధిలో పనపాకం పంచాయతీలో సచివాలయం రైతు భరోసా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ సచివాలయంలో ప్రతిరోజు ప్రజల నుండి సమస్యలను వినతులు స్వీకరించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. వివిధ పథకాలకు సంబంధించిన అర్హులు, అనర్హతలు జాబితాలను పరిశీలించారు. ఎంపీడీవో డాక్టర్ మురళీ మోహన్ రెడ్డి, తహశీల్దార్ శిరీష సంబంధించిన అధికారులను గృహ నిర్మాణాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం 5వ తేదీ నిర్వహించనున్న మెగా మేళా పై వివరాలు అడిగి తెలుసుకుని, వ్యాక్సినేషన్ పై దృష్టిపెట్టి నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసి, గ్రామ పరిధిలో రైతుల వేసుకున్న పంట వివరాలను అడిగారు. 350 ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయి అని అందుకు సంబంధించిన ఎరువులను రైతు భరోసా కేంద్రం నుండి 50 వేలకు పైగా సరఫరా చేశామని, అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఉన్న పశు సంపద గురించి 1406 ఆవులు, 1650 మేకలు, గొర్రెలు, పౌల్ట్రీ లో 9500 కోళ్లు పెంచడం జరుగుతుందని, వీటికి అవసరమైన వ్యాక్సినేషన్ తో పాటు డి - వార్మింగ్ ప్రక్రియ జరిగిందని అధికారులు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ కు అధికారులు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa