ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణీ కి ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 02:40 PM

ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణీ ఎస్టీకి చెందిన వ్యక్తి అని సమగ్ర దర్యాప్తు అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి విశ్వరూప్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ అప్పిలేట్ అథారిటీ నిర్ధారించింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. హైకోర్టు సూచనలు మేరకు పశ్చిమగోదావరి జిల్లా కుల నిర్ధారణ కమిటీ సమగ్ర విచారణ అనంతరం పాముల పుష్పశ్రీవాణి తండ్రి పాముల నారాయణమూర్తి ఎస్టీ కొండదొర కులానికి చెందిన వారిగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటన విడుదల చేసింది. దానిని సవాల్ చేస్తూ న్యాయవాది రేగు మహేశ్వరరావు, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. అప్పిలేట్ అథారిటీ ద్వారా సమగ్ర దర్యాప్తు కుల నిర్వహించి నిర్ధారణ చేయాలని, అందుకోసం గిరిజన సంక్షేమ శాఖ అప్పిలేట్ అథారిటీ కాకుండా వేరే వారిని నియమించాలని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ అప్పిలేట్ అథారిటీ నియమించింది. సమగ్రమైన సమాచారాన్ని సేకరించి, దర్యాప్తు అనంతరం పాముల నారాయణ మూర్తి, పుష్పశ్రీవాణీలు కొండదొర, షెడ్యుల్ తెగ సామాజిక వర్గానికి చెందిన వారిగా నిర్ధారించి దర్యాప్తు నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అప్పిలేట్ అథారిటీ ప్రకటన విన్న కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి, సర్పంచ్ సుజాత, జడ్పీటీసీ జి. సుజాత, జిల్లా పరిషత్ కో- ఆప్సన్ మెంబర్ షేక్ నిషార్, ఉపసర్పంచ్ షేక్ ఆదిల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణా సంచాకాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa