విశాఖ: టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ ఎన్.వి.రఘు ఆస్తులపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు రావడంతో ఎన్.వి.రఘు సహా ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలో 15, విజయవాడలో 5 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. విశాఖ, రాజమండ్రి, మంగళగిరి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, షిర్డీల్లో రఘు ఆస్తులపై దాడులు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa