ఈ నెల 20న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 'మత్స్యకార అభ్యున్నతి సభ' నిర్వహించాలనిజనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందింప చేయడం,వృత్తిపరమైన ఉపాధి భరోసా, మత్స్యకారుల డిమాండ్ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయి.ప్రభుత్వంలోని పెద్దలకు వీటిపై దృష్టి పెట్టే సమయం, ఆలోచన రెండూ లేని నేపథ్యంలో మత్స్యకారుల పక్షాన ముఖ్యంగా మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఉన్న 217 జీవోపై గళమెత్తడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని పార్టీ ప్రకటనలో తెలిపింది.
ఇందులో భాగంగా 13 నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ యాత్రను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారని పేర్కొంది. 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని పార్టీ స్పష్టం చేసింది.
అనంతరం ఈ నెల 20 న నరసాపురంలో జరిగే బహిరంగ సభకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపింది. ఈ యాత్రలో పార్టీ మత్స్యకార వికాస విభాగం క్షేత్ర స్థాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలను అధ్యయనం చేస్తుంది. ఇందుకు సంబంధించిన నివేదికను వికాస విభాగం చైర్మన్ శ్రీ నాయకర్, ఇతర సభ్యులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అందజేస్తారని పార్టీ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa