చిత్తూరు: భర్త వేధింపులకు గురి చేయడంతో పాటు తన ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేశాడంటూ ఓ మహిళా పోలీసులను ఆశ్రయించింది. వన్టౌన్ సిఐ నరసింహ రాజు కథనాల మేరకు. చిత్తూరు నగరంలోని లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన విష్ణు ప్రియాకు హైదరాబాద్ కు చెందిన కాంట్రాక్టర్ రాధా కృష్ణ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి పదేళ్లు , ఎనిమిదేళ్లు వయసున్న మగ పిల్లలు ఉన్నారు. ఇటీవల తరచూ వేధింపులకు గురి చేయడంతో విష్ణు ప్రియ తన ఇద్దరు పిల్లల్ని హైదరాబాదు నుంచి చిత్తూరుకు వచ్చేసింది. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన భర్త , ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని వెళ్లిపోయాడంటు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa