విద్యార్ధుల హాజరులో పారదర్శకత పెంచేందుకు బయో మెట్రిక్ యాప్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇంటిగ్రేటెడ్ అటెండన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతో తయారైన యాప్ పై ప్రిన్సిపల్ , అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముందుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని , విద్యార్ధులు, అధ్యాపకుల హాజరు వివరాలు ఎప్పటికప్పుడు సీఎం డాష్ బోర్డుకు అనుసంధానం అవుతాయని తెలిపారు. విద్యారంగంపై రోజువారీ అంచనాకు బయోమెట్రిక్ సహకరిస్తుందని మంత్రి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa