బళ్లారిలో పెళ్ళికి వెళ్లి వస్తుండగా అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం వద్ద కారుని, లారీ ఢీ కొట్టడం వలన మొత్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన లో మృతులైన వారు బీజేపీ నాయకులుగా గుర్తించారు. 6 గురు మహిళలు , ఒక బాలుడు మరియు బీజేపీ నాయకులూ కోకా వెంకటప్ప గ గుర్తించారు. ఐతే బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు మాట్లాడుతూ "భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కోకా వెంకటప్ప గారు,వారి కుటుంబ సభ్యులు 8 మంది ఉరవకొండ వద్ద జరిగిన ప్రమాదంలో అకాల మరణం చెందారన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.మనసును కలచివేసే ఈ హృదయవిదారక సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.ఈ కఠినమైన సమయంలో బీజేపీ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను" అని తెలియ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa