పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం పంచాయతీ సుంకర వారి తోటకి చెందిన పిడుగుల వెంకట గాంధీ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడు. చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. 6 వ డివిజన్ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్, పంచాయతీ చెందిన కొందరి వేధింపులే కారణమని బాధితుడు అతని భార్య ఆరోపించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , ఏలూరు నగర టిడిపి ఇంచార్జ్ బడేటి రాధాక్రిష్ణయ్య, (చంటి)టిడిపి నాయకులు పరామర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa