అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 238 పరుగుల లక్ష్యంతో వెస్టిండీస్ 193 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కీలక పాత్ర పోషించాడు. ప్రసిద్ధ్ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్ 2, సిరాజ్ 1, చాహల్ 1, సుందర్ 1, హుడా 1 వికెట్లు తీశారు. వెస్టిండీస్‌లో షమ్రా బ్రూక్స్ 44 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు.లోయర్ ఆర్డర్ లో అఖిల్ హొస్సేన్ (34), ఒడియన్ స్మిత్ (24) రాణించినా కాసేపటికే 46 ఓవర్లలో ఆలౌట్ అయ్యారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఈ నెల 11న జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa