విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే ప్రసాదంపాడు జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని వేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతో లారీ డ్రైవర్ అక్కడ నుండి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్ధానికులు వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa