ప్రయాణికులకు ముఖ్య గమనిక. చెన్నై-గూడూరు సెక్షన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, దారి మళ్లించి నడపనున్నట్లు తెలిపింది.నెల్లూరు-సూళ్లూరుపేట మధ్య నడిచే మెమూ రైళ్లను (06746/06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. విజయవాడ-చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లను ఈ నెల 22న గూడూరు-చెన్నై సెంట్రల్ మధ్య, హైదరాబాద్-తాంబరం (12760) రైలును ఈ నెల 26న చెన్నైబీచ్-తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేశారు.పుదుచ్చేరి-న్యూఢిల్లీ (22403) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16న చెంగల్‌పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్‌ల మీదుగా దారి మళ్లించారు. ఇండోర్-కొచువేలి ఎక్స్‌ప్రెస్ (22645) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్ మీదుగా మళ్లించారు. ధన్‌బాద్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్ (13351) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా, అలాగే, కాకినాడ-చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ (17644) ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa