దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుదల నమోదైంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8గంటల వరకూ.... కొత్తగా 50వేల 407 కేసులు నమోదయ్యాయి. మరో 804 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా లక్షా 36 వేల 962 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా..... 6 లక్షల 10 వేల 443 యాక్టివ్ కేసులు ఉన్నట్లు..... కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 3.48శాతానికి దిగివచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 172 కోట్ల 29 లక్షల కొవిడ్ డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa