హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః ప్రశ్నిం చేందుకు వస్తున్నామంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కాలుమో పేందుకు సిద్దమవుతున్న జనసేన పార్టీ నాయకత్వం ముందుచూపు లోపంతో వ్యవహరిస్తోందా....? రెండు తెలుగు రాష్ట్రాలలో ఎనభైశాతానికిపైగా ఉన్న బడుగు, బలహీనవర్గాల పట్ల ఆ పార్టీ విధానం ఏమిటీ అన్నది ప్రస్తుతం ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం అన్ని పార్టీల విధానాలతో విసిగిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కొత్త రాజకీయ వేదిక కోసం ఎదురుచూస్తున్న వారి విశ్వాసాన్ని చూరగొనే కొత్త వేదిక ఇప్పటి వరకు రాకపోవడం ఆ వర్గా లను కొంత నిరాశకు గురిచేస్తోంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీ యాలలో కాలు మోపేందుకు వస్తున్న జనసేన పార్టీపై కొత్త ఆసక్తికర చర్చ సాగుతున్న ఆ పార్టీ నాయకత్వం మాత్రం ముందస్తు వ్యూహలోపంతో ముందుకెళ్తున్నట్లు విమర్శలు వెల్లువ ెత్తుతున్నాయి. జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లు కల్పించాలని ఓ వైపు దగాపడ్డ బీసీలు ఆందోళనలు చేస్తుంటే రిజర్వేషన్లు లేని సమాజం ఏర్పాటు కావాలని జనసేన అధినేత పవన్ కళ్యా న్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు కొంత ఇబ్బందికర పరిస్థితులను కల్పిం చేట్లు కనిపిస్తున్నాయి. అనుకొన్న మేర రిజర్వేషన్లు అమలు కాకపోవడంవల్ల ఆ ఫలాలు సరిగ్గా అందుకోకపోవడంవల్లే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు నేటికీ సమానత్వం కోసం పోరాడుతున్నాయి. ఈ తరుణంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంతో దానిపై ఈ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రిజర్వేషన్లపై తన విధానం ఏమిటో స్పష్టం గా మరోసారి జనసేన పార్టీ చెప్పకపోతే మాత్రం ఆ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బం దులు తప్పవని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజర్వేషన్లు కల్పించినా పాలకవర్గాల కుట్రల వల్ల నేటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు వెనకబడ్డా యని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రిజ ర్వేషన్ల పరిధిని మరింత పెంచి ఈ వర్గాలకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ప్రస్తు తం ఉందని వారు చెబుతున్నారు. కానీ అందుకు భిన్నంగా రిజర్వేషన్లు లేని సమాజం రావాలని, అప్పుడే అంబేద్కర్ కలలుగన్న రాజ్యం వస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నడం వింతగా ఉందని బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. తమ జాతికి రిజర్వేషన్లు ఇవ్వకుంటే ఈ దేశానికి స్వాతంత్య్రమే అవసరంలేదని చెప్పిన మహానీయుడు అంబేద్కరని, రిజర్వేషన్ల వల్లే వెనకబడిన వర్గాల అభ్యున్నతి అని ఆయన గాఢంగా విశ్వసిం చారని ప్రజా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. కానీ అందుకు భిన్నంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆశించిన సమాజం ఏర్పాటుచేద్దామని చెప్పడం వింతగా ఉందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
జనసేన అజెండా ఏమిటీ....?: రాజకీయాలలో వచ్చే ప్రతి కొత్త పార్టీ తనకంటూ ఓ ప్రత్యేక అజెండాతో ముందుకు వస్తుంది. కానీ జనసేన పార్టీ విధానం ఏమిటో ఇప్పటి వరకు స్పష్టం కాని పరిస్థితి అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జనసేన బడుగు, బలహీనవర్గాల కోసం వస్తున్న పార్టీయా లేక మరో కొత్త నినాదంతో వస్తున్న పార్టీయా అన్నది ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఈ డిమాండ్‌లోనూ వాస్తవికత ఉందని రాజకీయ వర్గాల భావన. నేటికీ పాలనాధి కారానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో ఈ వర్గాల డిమాండ్ సహేతుకమని వారు పేర్కొంటున్నారు. తప్పని పరిస్థితుల్లో ఈ వర్గాల నినాదాలకు మద్దతు ఇస్తూ అధికారంలోకి వచ్చాక పాలక వర్గాలు విస్మరించడం వల్లే కొత్త రాజకీయ వేదికను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కోరుకొంటున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో మెజార్టీగా ఉన్న ఈ వర్గాలను ఆకట్టుకోవాలంటే రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేక కార్యాచరణతో జనసేన రావాల్సింది పోయి రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రస్తావించడం ఆ పార్టీకి కొంత నష్టమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ప్రజా సంఘాల నేతలు ధృవీకరిస్తున్నారు. కేవలం ప్రశ్నిస్తామని చెప్పడానికే పరిమితం కాకుండా జనసేన పార్టీ నాయకత్వం తన ఎన్నికల విధానాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం చేపట్టే ప్రత్యేక కార్యచరణను వెల్లడించాల్సిన అవసరముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa