ట్రెండింగ్
Epaper    English    தமிழ்

7న ‘చింతలపూడి’ రెండో దశ పనులు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 06, 2017, 10:58 AM

  వెలగపూడి, సూర్య బ్యూరో :  ఆంధప్రదేశ్‌ను కరవు రహితంగా రాష్ర్టంగా తీర్చిదిద్ది, వ్యవసాయానికి స్వర్గధామంగా మార్చాలన్న సంక్పలంతో రాష్ర్ట ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను విస్త తంగా నిర్మిస్తోంది. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద రూ. 3,208.80 కోట్లతో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. క ష్ణాజిల్లాలోని రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల కాలంలో రూ.39 వేల కోట్లతో పలు ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించింది. రాష్ర్టంలో ఉన్న ప్రతి ఎకరాకూ సాగునీరిందివ్వాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం. దీనిలో భాగంగా రాబోయే ఏడాది కాలం లో 24 ప్రాజెక్టులను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. 


    గత నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందరేంగా పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథ కాన్ని సీఎ చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పటికే గోదావరి జలాలను క షా? డెల్టాకు తరలించి ప్రభుత్వం సత్ఫలితాలు సాధించింది. ఇపుడు మరో ఎత్తిపో తల పథకానికి వినియోగంలో తేవడానికి నిర్ణయించింది. ఇప్పటికే రూ.1701 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ. 3,208.80 కోట్లతో రెండో దశ పనులకు గురువారం నుంచి శ్రీకారం చుడుతోంది.  ఇలా రూ.4.909.80 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, కష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు గోదావరి జలాలు తరలించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. 15 ఏళ్ల నుంచి నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ 3వ జోన్‌ పరిధిలోఉన్న 18 మండలా లకు చెందిన 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందడంలేదు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ద్వారా ఆ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర నున్నాయి. 


ఎత్తిపోతల తీరు తెన్నులు...


  చింతలపూడి ఎత్తి పోతల పథకం పూర్త యితే, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల కు గోదావరి జలాలు తరలించొచ్చు. ఈ పథ కం ద్వారా గోదా వరి జలాలు రెండు దశల్లో ఎత్తిపోయ ను న్నారు. మొదటి దశ లో పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం వద్ద 18 పంపులను ఏర్పాటు చేసి, పైపుల ద్వారా 27 మీటర్ల ఎత్తుకు తోడి, లీడింగ్‌ చానల్‌ ద్వారా గోదావరి జలా లను పంపించనున్నారు. అక్కడి నుంచి 13.22 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలపురం మండలంలోని గుడ్డిగూడెం గ్రామానికి గోదావరి జలాలు చేరు కుంటాయి. అక్కడ రెండో దశ పథకం కింద లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తారు. అక్కడ 14 పంపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా 92 మీటర్లు ఎత్తులో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువలోకి గోదావరి జలాలను ఎత్తిపోతలు చేస్తారు. అదే సమయంలో ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి, నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ 21వ బ్రాంచి కెనాల్‌ కు అనుసంధానించి, కష్ణాజిల్లాలోని నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. 


ఈ పథకం వల్ల కలిగే లాభాలు


  చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే, కష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా లకు చెందిన 9 నియోజకవర్గాల్లోని 33 మండలాలకు చెందిన 2 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందనుంది. అలాగే, 2.80 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వాడ కాలువ ప్రాజెక్టు పరిధిలో గల 17 వేల ఎకరాలు, ఎర్ర కాలువ ప్రాజెక్టు కింద ఉన్న 28 వేల ఎకరాలతోపాటు తమ్మిలేరు ప్రాజెక్టు పరిధిలోఉన్న పశ్చిమ గోదావరి, కష్ణా జిల్లా లోని మరో 25 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. వాటితో పాటు కష్ణా జిల్లాలో ఉన్న 200 చెరువులను నింపడం ద్వారా 50 వేల ఎకరా లతో పాటు నాగార్జునసాగర్‌ కాలువలపై నిర్మించిన చిన్ననీటి ఎత్తిపోతల పథ ాల కింద ఉన్న మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ రెండు దశల వల్ల భూగర్భ జల మట్టం పెరిగి, బోర్ల ద్వారా మరిన్ని ఎకరాలకు సాగు నీరు అందుబాటులోకి రానుంది. చింతలపూడి పథకం ప్రధాన కాలువపై రౌతు గూడెం, రెడ్డిగణపవరం గ్రామాల మధ్య 3వ లిఫ్ట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ లిఫ్ట్‌ దగ్గర 6 పంపులను ఏర్పాటుచేసి, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్లేరు వాగుపై 20 టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న జలాశయానికి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు. 410 గ్రామాల్లో 21 లక్షల జనాభాకు తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. 


9 నియోజక వర్గాలు... 33 మండలాలకు లబ్ధి


  చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా కష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలోని 9 నియోజక వర్గాల ప్రజలకు లబ్ధి కలుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు నియోజక వర్గాలకు చెందిన గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, జంగారెడ్డి గూడెం, జీలుగుమిల్లి, టి.నరసాపురం, చింతపూడి, లింగపాలెం, కామవరపు కోట, ద్వారకా తిరుమల, నల్లజర్ల దేవరపల్లి, పేదవేగి, దెందులూరు, పెదపాడు మండలాల ప్రజలకు గోదావరి జిలాలతో ఎంతో మేలుకలుగనుంది. అలాగే, క షా? జిల్లాలో మైలవరం, తిరువూరు, గన్నవరం, నూజివీడు, నందిగామ నియోజ వర్గాల ప్రజలకు గోదావరి జలాల ఫలాలు అందనున్నాయి. ఈ 5 నియోజకవర్గాల్లోని 18 మండలాలైన చాట్రాయి, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం,మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికర్ల, వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, నూజివీడు, గన్నవరం, బాపుల పాడు, ఉంగుటూరు, అగింపల్లి, విజయవాడ రూరల్‌ మండల వాసులకు చింతలపూడి ఎత్తిపోతల పథకంతో ఉపయోగం కలుగనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa